: హైదరాబాదును వేరు చేసే ఆలోచన కేంద్రానికి లేదు: మధుయాష్కీ
హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేసే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. సీఎం, మంత్రులు ఎందరు అడ్డుకున్నా తెలంగాణ ప్రక్రియ ఆగదని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రా?.. లేక, సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రా? అని యాష్కీ ప్రశ్నించారు. ఏపీఎన్జీవోల సభ తర్వాత ముఖ్యమంత్రిని ఆంధ్రకు సీఎంగానే భావిస్తున్నామన్నారు.