: జేసీ నోట 'జై రాయల తెలంగాణ', 'జై తెలంగాణ' నినాదాలు


సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతోండగా అక్కడకి వచ్చిన మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి నినాదాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. విషయం ఏంటంటే.. ఐదుగురు మంత్రులు, నలుగురు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు సీఎల్పీ ఆఫీసులో భేటీ అయి చర్చించుకుంటున్నారు. ఈలోపు జేసీ సమావేశం జరుగుతున్న హాల్లోకి వచ్చారు. 'జై రాయల తెలంగాణ' అంటూ నినాదం చేశారు. రాయల తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా ఎలా వస్తారు? అని తెలంగాణ నేతలు ప్రశ్నించేసరికి.. జేసీ కాస్తా 'జై తెలంగాణ' అనుకుంటూ అక్కడి నుంచి వెనుదిరిగారట.

  • Loading...

More Telugu News