: అండమాన్ తీరంలో ఐదుగురు విదేశీయులు అదుపులోకి


ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సంచరిస్తున్న ఐదుగురు విదేశీయులను అండమాన్ నికోబార్ తీరంలో కోస్టు గార్డు దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో నలుగురు థాయ్ లాండ్, ఒక మయన్మార్ పౌరుడు ఉన్నారు. దిగ్లిపూర్ తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో వీరు ప్రయాణిస్తున్న బోటును కోస్టు గార్డు దళాలు ఈ నెల 6న అడ్డగించాయి. వారివద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేవు. బోట్లలో మందుగుండు సామగ్రి, ఆయుధాలను గుర్తించారు. దాంతో బోటుతో సహా వారిని దిగ్లిపూర్ తీరానికి తీసుకువచ్చిన కోస్టు గార్డు దళాలు వారిని విచారణ కోసం పోలీసులకు అప్పగించాయి.

  • Loading...

More Telugu News