: అశ్లీల ఎస్సెమ్మెస్ లు పంపుతున్న మహిళా పోలీసు అరెస్టు
ఇటీవల కాలంలో అబ్బాయిలు.. అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపిన ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే అందుకు భిన్నంగా బీహార్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. గయ జిల్లాలో ఉద్యోగం చేస్తున్న జ్యోతి కుమారి అనే మహిళా కానిస్టేబుల్.. కన్వల్ తనూజ్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారికి తరచూ అశ్లీల సందేశాలు పంపుతోందట.
దీంతో విసిగిపోయిన ఆ యువ అధికారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్వల్ అధికారిక నివాసం వద్దే సోమవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గత రెండు నెలలుగా తన అధికారిక మొబైల్ ఫోన్ కు కాల్ చేస్తూ ఆమె తనను మానసిక వ్యధకు గురిచేసిందని కన్వల్ వెల్లడించారు.