: ఐపీఎల్-7 శ్రీలంక లేదా బంగ్లాదేశ్ లో..!


క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి పక్క దేశాలకు తరలిపోనుంది. ఈ మేరకు 'ఐపీఎల్-7' సీజన్ శ్రీలంక లేదా బంగ్లాదేశ్ లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలు, మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రత్యక్ష ప్రసారాల్లో ఎలాంటి మార్పు ఉండదు.

2009లో ఇలాగే ఎన్నికలు జరగడంతో అప్పుడు ఐపీఎల్-2ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఇప్పుడు కూడా 2014 ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు జరుగుతుండటంతో బోర్డు చర్యలు తీసుకుంది. అంతేగాక లంక, బంగ్లాలకు ప్రయాణ సమయం కూడా తక్కువని, కాబట్టి సమస్య ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారి చెప్పారు. ఎన్నికల తేదీలు ప్రకటించాక కొన్ని మ్యాచ్ లు ఇండియాలో, మిగతావి ఆ దేశాల్లో నిర్వహించవచ్చంటున్నారు.

  • Loading...

More Telugu News