: కాణిపాకంలో హంస వాహనంపై ఊరేగనున్న స్వామివారు


కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈ రోజు స్వామివారికి ధ్వజారోహణం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ కార్యనిర్వహణాధికారి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం స్వామివారు హంసవాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. కోరిన కోర్కెలు తీర్చే గణపయ్యను దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు, తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

  • Loading...

More Telugu News