: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్
దేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాద దాడుల భయం వెన్నాడుతూనే ఉంది. నిన్న ఢిల్లీలోని మూడు చోట్ల అనుమానాస్పద బ్యాగులతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
ఢిల్లీ నుంచి పాట్నా వెళుతున్న విమానంలో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన బాంబు నిర్వీర్య దళం, భద్రతా సిబ్బంది విమానాశ్రయం అంతా తనిఖీలు నిర్వహించారు.
ఢిల్లీ నుంచి పాట్నా వెళుతున్న విమానంలో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన బాంబు నిర్వీర్య దళం, భద్రతా సిబ్బంది విమానాశ్రయం అంతా తనిఖీలు నిర్వహించారు.
అయితే, బాంబు ఏదీ లేదని తెలియడంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉందని.. ఎక్కడ నుంచి ఈ కాల్ వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు నగర డీసీపీ ఎ సంజీవ్ చెప్పారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.