: న్యూజిలాండ్ లో టీమిండియా పర్యటన ఖరారు
వచ్చే ఏడాది ఆరంభంలో టీమిండియా.. న్యూజిలాండ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. జనవరి 19న నేపియర్ లో జరిగే తొలి వన్డేతో టూర్ ఆరంభమవుతుంది. ఈమేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ వివరాలు మీడియాకు తెలిపింది. కాగా, ఐదో వన్డే జనవరి 31 జరగనుండగా, ఆ తర్వాత మొదలయ్యే టెస్టు సిరీస్ కోసం సన్నాహకంగా భారత్ ఓ రెండు రోజులు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ వామప్ మ్యాచ్ ఫిబ్రవరి 2, 3 తేదీల్లో జరుగుతుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు ఆక్లాండ్ లో జరుగుతుంది. రెండో టెస్టుకు ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు వెల్లింగ్టన్ వేదికగా నిలవనుంది.