: రాష్ట్రంకోసం ఇదో రకం నిరసన..


రాష్ట్ర విభజనను నిరసిస్తూ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి విభిన్న నిరసనను తెలియజేస్తున్నారు. అంతకుముందు సమైక్యాంధ్ర కోసం ఏడు రోజుల దీక్ష చేశారు. తాజాగా, తనకు రక్షణగా ఇచ్చిన ఇద్దరు గన్ మన్ లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. విభజనపై స్పష్టమైన నిర్ణయం వచ్చేవరకూ గన్ మెన్ ను తీసుకోనన్నారు. అంతకుముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన కొత్త నిర్ణయంతో సంచలనం సృష్టిస్తున్నారు. రక్షణ ఇచ్చేవారు లేకుండానే ఆయన టౌన్ లో తిరుగుతుండడంపై, భద్రతపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న తనకు సమాజంలో ఉన్న ప్రతిఒక్కరితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అలాంటప్పుడు తనకు ప్రాణభయం కూడా లేదన్నారు. రాష్ట్రంపై ప్రకటన వచ్చే వరకు తన నిరసన కొనసాగుతూనే ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News