: ఉద్యోగులారా..ఆఫీసుకు రండి: యాహూ సంస్థ ఆదేశం
కంపెనీ కేఫటేరియాల్లో బాతాఖానీ..మీటింగ్ హాల్లో ముఖ్య సమావేశాలు..ఆఫీసు డెస్కుల్లో సహోద్యోగుల సలహాలు, సూచనలే..ఉద్యోగుల ఆలోచనలకు పదును పెడతాయంటోంది యాహూ సంస్థ. ఐటీ రంగంలో గూగుల్ సంస్థతో పోటీ పడుతున్న యాహూ.. తాజాగా సంస్థలోని ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తమ సంస్థ ఉద్యోగులందరూ ఇకపై ఇళ్ల నుంచి పని చేసే పద్ధతికి స్వస్తి చెప్పి..కార్యాలయాలకు రావాలని యాహూ సంస్థ ఆదేశించింది.
ఈ నిర్ణయం వెనుక మతలబు ఏంటంటే.. గూగుల్ సంస్థలో ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ తన సంస్థలోని ఉద్యోగులకు కూడా యాహూ అందిస్తూనే ఉంది. అయినా యాహూ సంస్థలో సరైన పురోగతి కనిపించలేదని సంస్థ భావించింది. అందుకే కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పనిచేస్తే..పని మరింత మెరుగ్గా ఉంటుందని..తద్వారా సంస్థ ప్రగతి బాట పడుతుందని యాహూ ఆలోచన.