: ఆయుధాలపై నియంత్రణ వదులుకుంటే సైనిక చర్య పక్కనపెడతా: ఒబామా


సిరియా రసాయనిక ఆయుధాలపై నియంత్రణను అంతర్జాతీయ అథారిటీకి అప్పగిస్తే.. సైనిక చర్యను పక్కనపెడతామని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పారు. సైనిక చర్యకు అమెరికా కాంగ్రెస్ (చట్టసభ) మద్దతు లభించకపోవచ్చని అంతకు ముందు టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా ఒబామా అన్నారు. అమెరికా ప్రజలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కాగా, అమెరికా ప్రజలు సిరియాపై సైనిక చర్యను వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ సమాజంలోనూ అదే పరిస్థితి ఉండడం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఒబామా తన నిర్ణయంపై పట్టు సడలిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News