: అంగారకుడిపై స్థిరనివాసం కోసం భారతీయుల క్యూ


భారతీయులకు భూమిపై నివాసం బోర్ కొట్టినట్లుంది.. అంగారకుడిపై కొత్త జీవితాన్ని ఆరంభించాలని తహతహలాడుతున్నారు. 'ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లు అంగారకుడిపై మానవ నివాసం సాధ్యమేనా? అన్నది ఇంకా తేలనేలేదు. అంతెందుకు, భూమి తప్ప మరే ఇతర గ్రహంపై మానవ మనుగడ సాధ్యమా? అన్నది నేటికి ప్రశ్నార్థకంగా ఉంది. కానీ, ఓ లాభాపేక్ష రహిత సంస్థ ‘మార్స్ ఒన్’ అంగారకుడిపై నివాసం కోసం ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. అమెరికన్లు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకోగా.. వారి తర్వాతి స్థానంలో భారతీయులే ఉన్నారు.

నెదర్లాండ్స్ కు చెందిన మార్స్ ఒన్ సంస్థ దరఖాస్తు చేసుకున్న వారిలోంచి కొందరిని షార్ట్ లిస్ట్ చేసి 2022లో తీసుకెళ్లి అంగారకుడిపై విడిచిపెడుతుంది. మొదటి దశలో 2,02,586 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అమెరికన్లు 47,654, భారతీయులు 20,747, చైనీయులు 13,176 మంది దరఖాస్తు చేసుకుని తొలి మూడు స్థానాలలో ఉన్నారు. నేడు అందుబాటులో ఉన్న టెక్నాలజీల సాయంతో అంగారకుడిపై నివాసం సాధ్యమేనని మార్స్ ఒన్ సంస్థ చెబుతోంది. నిజమే కొంత మందిని తీసుకెళ్లి అంగారకుడిపై వదిలేసి వస్తే సరి.. కొన్నాళ్లకు అక్కడ మానవ నివాసం సాధ్యమా, కాదా? అన్నది సులభంగా తెలిసిపోతుంది.

  • Loading...

More Telugu News