: సర్పంచిని కాల్చి చంపిన మావోయిస్టులు


ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భారీగా ఆయుధాలు ధరించిన మావోలు.. కోట మాటేరు గ్రామంలో సర్పంచి ఈశ్వరచంద్ర సోదిని అతి కిరాతకంగా కాల్చి చంపారు. అతనిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి కాల్చి చంపినట్టు జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు. అయితే ఈ సంఘటనకు కారణం ఏంటో స్పష్టంగా తెలియడం లేదు. కాకపోతే సర్పంచ్ పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే అనుమానంతోనే అతన్ని చంపి ఉండొచ్చని తెలుస్తోంది. సంఘటన జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ జిల్లాలో తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయిన రోజే ఈ సంఘటన జరగింది.

  • Loading...

More Telugu News