: యూఎస్ ఓపెన్ లో నాదల్ విజయనాదం


యూఎస్ ఓపెన్ సింగిల్స్ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ విజయకేతనం ఎగురవేశాడు. 3 గంటల 21 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో.. సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ పై నాదల్ 6-2, 3-6, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. మొదటి సెట్ లో 6-2 తో నాదల్ ముందంజ వేసినప్పటికీ.. రెండో సెట్లో జకోవిచ్ పుంజుకోవడంతో 3-6 తేడాతో సెట్ ను కోల్పోయాడు. మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ 27 ఏళ్ల నాదల్ 6-4 తేడాతో సెట్ ను గెలుచుకున్నాడు. చివరి సెట్ లో జకోవిచ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోవడంతో 6-1 తో సెట్ ను ముగించి విజయనాదం చేశాడు నాదల్.

ఈ విజయంతో నాదల్ తన గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్యను 13కు పెంచుకున్నాడు. ఈ ఏడాది నాదల్ కిది రెండో గ్రాండ్ స్లామ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో జకోవిచ్ అద్భుతంగా ఆడాడని... టెన్నిస్ లో అతను ఒక అద్భుతమైన ప్లేయర్ గా నిలిచిపోతాడని ఆట ముగిసిన అనంతరం నాదల్ కితాబిచ్చాడు.

  • Loading...

More Telugu News