: రైల్వే ప్రాజెక్టుల సాధనలో సీఎం ఫెయిల్: కేటీఆర్
రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నూటికినూరు శాతం విఫలమయ్యారని తెరాస ఎమ్మెల్యే కె. తారక రామారావు అన్నారు. రైల్వే బడ్జెట్ కు ముందు ఎంపీలతో సీఎం ఒక్కసారి కూడా సమావేశం కాలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీఏ సర్కారు కూలిపోకుండా నిలబెడుతున్న రాష్ట్ర ఎంపీలు ఈ విషయమై నోరు మెదపరెందుకని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ పై తెలంగాణ భవన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు తాజా బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్నారు.