: కడప జిల్లా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ
కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులో బీరువాను పగులగొట్టి అందులో ఉన్న దాదాపు రూ. 18 లక్షలు అపహరించినట్లు తెలుస్తోంది. అంతేకాక బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ ను కూడా తెరిచేందుకు యత్నించినట్లు సమాచారం. బ్యాంకు వరుసగా రెండు రెండురోజుల సెలవు కావడంతో పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందిని కూడా విచారించారు.