: మూత్రం నుండి మెదడు మూల కణాలు
మెదడుకు సంబంధించిన మూల కణాలను మనిషి మూత్రం నుండి సేకరించడంలో శాస్త్రవేత్తలు విజయాన్ని సాధించారు. సాధారణంగా మూల కణాలను రక్తంనుండి సేకరిస్తుంటారు. అయితే మూత్రం నుండి సేకరించడం అనేది కొత్త విధానం. ఈ పద్ధతిలో మెదడు కణాలను సులభంగా సేకరించవచ్చని కనెటికట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో వీరు విజయాన్ని సాధించారు.
మనం మూత్రం పోస్తున్నప్పుడు సాధారణంగా మూత్రపిండాల్లోని గోడల నుండి చర్మకణాలు బయటికి వస్తుంటాయి. ఈ చర్మకణాలనే జన్యుపరమైన మార్పులతో మెదడు మూల కణాలుగా శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. ఈ మూలకణాలు వివిధ రకాల మెదడు కణాలుగా కూడా మారగలవు. మూలకణాలను రక్తంలోనుండి సేకరించడంకన్నా కూడా మూత్రం నుండి సేకరించడం చాలా తేలిక. ఇలా మూత్రంనుండి కణాలను సేకరించడం అనేది పెద్దలనుండే కాకుండా పిల్లల నుండి కూడా సేకరించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కణాలతో పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి జబ్బులకు చేసే చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులను తేవచ్చని వీరు భావిస్తున్నారు.