: కుక్కలను నియంత్రించే రిమోట్లు


రిమోట్‌ కంట్రోల్‌తో చాలా పరికరాలను నియంత్రించవచ్చనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే రిమోట్లతో కుక్కలను నియంత్రించవచ్చని అంటే... ఆశ్చర్యపోతున్నారా... నిజంగానే ఇలాంటి రిమోట్లను పరిశోధకులు తయారు చేస్తున్నారు. ఈ రిమోట్లతో కేవలం టీవీలు, మ్యూజిక్‌ సిస్టంలు, ఫ్యాన్లు, లైట్లు వంటి వాటితోబాటు మనం ఎంతో ముద్దుగా పెంచుకునే జంతువులను కూడా నియంత్రించవచ్చని చెబుతున్నారు.

అమెరికాలోని ఓబర్న్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరంతో మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులను కూడా నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఈ పరికరంలో ఒక మైక్రో ప్రాసెసర్‌, వైర్‌లెస్‌ రేడియో, జీపీఎస్‌ రిసీవర్‌ వంటివి ఉంటాయి. మన పెంపుడు జంతువులకు అలవాటైన, ముందుగానే శిక్షణ నిచ్చిన పిలుపులు, కమాండ్లను ఈ పరికరంలో పొందుపరుస్తారు. పెంపుడు జంతువులు దూరంగా ఉన్నప్పుడు జీపీఎస్‌ సహాయంతో అవి ఎక్కడికి వెళ్లాలి, ఎలా రావాలి, ఏం చేయాలి? వంటి విషయాలను మన దగ్గర ఉండే పరికరంద్వారా ఆదేశించవచ్చట. అయితే పరికరం ద్వారా ఇచ్చిన ఆదేశాలను పెంపుడు కుక్కలు 98 శాతం కచ్చితత్వంతో పాటించాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెఫ్‌ మిల్లర్‌ చెబుతున్నారు. యజమానులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని నేరుగా నియంత్రించలేనంత దూరంలో ఉన్నప్పుడు ఈ పరికరం ఎంతగానో ఉపయోగరకంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News