: కాంగ్రెస్ కు గోరీ కట్టాల్సిందే: చంద్రబాబు నాయుడు
కాంగ్రెస్ పాలనకు గోరీ కట్టాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా మెట్టగూడెంలో తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగు జాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో టీఆర్ఎస్ తో, సీమాంధ్రలో వైఎస్సార్ సీపీతో నాటకమాడుతోందని ధ్వజమెత్తారు.