: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాక్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
పాకిస్థాన్ నూతన అధ్యక్షుడిగా మమ్నూన్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాస్వామిక ప్రక్రియద్వారా తొలిసారిగా పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆసిఫ్ అలీ జర్ధారీ తన ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా ముగించుకున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన జర్ధారీకి ఇస్లామాబాద్ శివారులోని అధ్యక్ష భవనంలో ఆదివారం సైనికులు గౌరవ వందనం చేశారు.