: యూపీ గవర్నర్ తో మాట్లాడా.. అల్లర్లు మతశక్తుల పనే: షిండే
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి షిండే స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్ తో తాను మాట్లాడానని, సమస్యపై ఆరా తీశానని తెలిపారు. అయితే అక్కడ కొన్ని మత శక్తులు అల్లర్లు సృష్టిస్తున్నారనేది నిఘావర్గాల సమాచారమని తెలిపారు. కేంద్రం చేసిన ముందస్తు హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, దాని ఫలితంగానే ఇప్పుడు అల్లర్లు చోటుచేసుకున్నాయని షిండే స్పష్టం చేశారు.