: యూపీ శాంతి భద్రతలపై కేంద్రం సమీక్ష


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ నగర్ లో చెలరేగిన అల్లర్లలో 31 మంది మృతి చెందడంతో కేంద్రం కదిలింది. ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నామని యూపీ గవర్నమెంటు తెలిపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News