: దుండగుల చేతిలో మృతి చెందిన ఇద్దరు ఇండోటిబెటన్ బోర్డర్ పోలీసులు
అలహాబాద్ లోని రెడ్ లైట్ ఏరియాలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లను దుండగులు కాల్చిచంపారు. నగర శివార్లలో విధులు నిర్వర్తిస్తున్న అనూప్ సింగ్, లాల్ మణి ఠాకూర్ లతో గత రాత్రి మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దురు దుండగులు గొడవకు దిగి మరీ కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించే లోపే జవాన్లిద్దరూ తుది శ్వాస విడిచారని అధికారులు వెల్లడించారు.