: హైదరాబాద్ లో మట్టి విగ్రహాలు ఎక్కడివక్కడే నిమజ్జనం
హైదరాబాద్ లో కొలువైన అన్ని విగ్రహాలనూ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం ఏటా చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాదీ చూస్తాం... కాకపోతే మట్టి విగ్రహాలను స్థానికంగా ఎక్కడివక్కడే నిమజ్జనం చేసేలా ప్రచారం చేసేందుకు హెచ్ ఎండీఎ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల హుస్సేన్ సాగర్ పై పర్యావరణమైన ఒత్తిడిని తగ్గించాలన్నది అధికారుల యోచన. ఇందులో భాగంగానే ఈ సారి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2 లక్షలకు పైగా మట్టి విగ్రహాలను నగర వ్యాప్తంగా పంపిణీ చేశారు.