: పలు నగరాలకు ముప్పు.. నిఘావర్గాల హెచ్చరికలు
వినాయక చవితి సందర్భంగా తీవ్రవాదులు విరుచుకుపడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీ సహా అన్ని రాష్ట్ర రాజధానులు, ప్రధాన పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘావర్గాలు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. దీనితో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సూచించాయి. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి దానిపై స్థానికులు దగ్గర్లోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.