: యూపీకి అదనపు బలగాలు
అల్లర్లతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు కేంద్రం అదనపు బలగాలను పంపించనుంది. 5 వేల మంది పారామిలటరీ దళాలను ఇప్పటికే పంపామని, యూపీ ప్రభుత్వం మరిన్ని బలగాలు కావాలని కోరితే పంపడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ తెలిపింది. అదివారం తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని దీంతో ముజఫర్ నగర్ నెమ్మదిగా కోలుకుంటోందని తాను భావిస్తున్నానని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.