: టీనేజ్ లోనే మూడు ముళ్లు
చదువుకోవాల్సిన, ఆడి పాడాల్సిన వయసు టీనేజ్. ఈ వయసులో జీవితం, బాధ్యతలపై పూర్తిగా అవగాహన ఉండదు. కానీ దేశంలో 46 శాతం మంది మహిళలు (18 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్నవారు) 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నట్లు జాతీయ కుటుంబ సర్వే-3 వెల్లడించింది. దేశంలో 2.3కోట్ల మంది బాల వధువులు ఉన్నట్లు పేర్కొంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ సంస్థ, చిన్నవయసులోనే వివాహాలు చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రచార కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇక, ప్రస్తుతమున్న ధోరణే కొనసాగితే 2011 నుంచి 2020 మధ్య కాలంలో అంతర్జాతీయంగా 14 కోట్ల కంటే ఎక్కువ మంది బాలికలు వధువులుగా మారిపోతారని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనా వేస్తోంది.