: షోపియాన్ జిల్లాలో కొనసాగుతున్న కర్ఫ్యూ
జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో కర్ఫ్యూ ఈ రోజు కూడా కొనసాగుతోంది. తమ క్యాంపుపై దాడికి యత్నించిన ఆందోళనకారులపై సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురిని స్థానికులుగా గుర్తించారు. ఈ రోజు కూడా వాణిజ్య సంస్థలు, షాపులు మూతబడే ఉన్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అదనపు బలగాలను రంగంలోకి దింపారు.