: యూపీలో రాష్ట్రపతి పాలనకు ప్రతిపక్షాల డిమాండ్
ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ సర్కారుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ముజఫర్ నగర్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయని ఆరోపించాయి. రాష్ట్రీయ లోక్ దళ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు అఖిలేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాయి.
మరోవైపు అల్లర్ల ప్రాంతాలలో బీజేపీ నిజనిర్థారణ కమిటీ పర్యటించనుంది. అల్లర్లకు గల కారణాలను, పరిస్థితులను ఈ కమిటీ తెలుసుకుంటుంది. రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యల కమిటీని పార్టీ నియమించింది. అయితే, అల్లర్ల ప్రాంతాలలో ఎవరూ పర్యటించడానికి వీల్లేదంటూ ఉత్తరప్రదేశ్ సర్కారు నిషేధాజ్ఞలు విధించింది. దీంతో కమిటీ సభ్యులను ముందుగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.