: సత్తా తగ్గని సెరెనా.. యూఎస్ మహిళల టైటిల్ సొంతం


సెరెనా విలియమ్స్ మరోసాసి తన సత్తా ఏంటో క్రీడాభిమానులకు చూపించింది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఫైనల్స్ లో అజరెంకాపై 7-5, 6-7, 6-1 తేడాతో చక్కటి విజయాన్ని ఖాయం చేసుకుని తన కెరీర్ లో మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకుంది. అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ 1999లో 16 ఏళ్ల వయసుకే యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను గెల్చుకుంది. 31 ఏళ్ల వయసులోనూ యుఎస్ ఓపెన్ మహిళల కప్ గెలుచుకుని నాటికి, నేటికీ తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. సెరెనా తన కెరీర్ లో ఇప్పటి వరకూ 16 గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ ను గెలుచుకుంది. 2002లో వింబుల్డన్ టైటిల్ గెలిచిన దగ్గర నుంచి సెరెనా అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం వచ్చింది.

  • Loading...

More Telugu News