: రోజూ అరగంట సంగీతానికి కేటాయించండి


ప్రతిరోజూ ఒక అరగంటసేపు సంగీతాన్ని వింటే చాలు... మన గుండె ఆరోగ్యాన్ని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదట. కొందరు అధ్యయనకర్తలు ప్రత్యేకంగా నిర్వహించిన అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. మన గుండె ఆరోగ్యాన్ని పదికాలాలపాటు భద్రంగా కాపాడే విషయంలో సంగీతం కూడా కొంతమేర ప్రాధాన్యతను సంతరించుకుంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

సెర్బియాకు చెందిన అధ్యయనకర్తలు సంగీతాన్ని వినడం ద్వారా మన గుండె పనితీరు చక్కగా ఉండేలా చూసుకోవచ్చని చెబుతున్నారు. సాధారణంగా సంగీతాన్ని వినడం వల్ల మన మనసుకు ఉత్సాహం కలుగుతుంది. అలాగే మన మనసుకు నచ్చిన సంగీతాన్ని రోజూ ఒక అరగంట సేపు వినడం వల్ల మన గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుందని వీరి అధ్యయనంలో తేలింది. ఇలా సంగీతాన్ని వినడం వల్ల మన గుండె పనితీరు 19 శాతం వరకూ మెరుగుపడుతుందని, దీనితోబాటు ఒక అరగంటసేపు వ్యాయామం కూడా చేయగలిగితే మరింత ఎక్కువగా లాభాన్ని పొందవచ్చని చెబుతున్నారు. ఇలా సంగీతాన్ని వినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడానికి కారణం మన శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లేనని, అయితే ఏవి పడితే అవికాకుండా మన మనసుకు నచ్చిన పాటల్ని వింటూ ఆనందించడం వల్ల మాత్రమే మన శరీరంలో హ్యాపీ హార్మోన్లుగా పరిగణించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఈవిధంగా హ్యాపీ హార్మోన్లు విడుదల వల్ల మనపై ఒత్తిడి తగ్గి, ఉల్లాసంగా మారతామని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News