: గణేశుడి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సిద్ధం
గణేశుడి ఉత్సవాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమైంది. అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలలో ఖైరతాబాద్ లోని 59 అడుగుల చతుర్ముఖ వినాయకుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను వేదికల వద్దకు ఉత్సవ నిర్వాహకులు తరలిస్తున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని గణనాధుడు సోమవారం ఉదయం నుంచి పూజలు అందుకోనున్నాడు.