: అధిష్ఠానాన్ని సీఎం ఎలా వ్యతిరేకిస్తారు?: ఎంపీ రాజగోపాల్ రెడ్డి
తెలంగాణపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం ఎలా ధిక్కరిస్తారని భువనగిరి ఎంపీ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. భువనగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని ముఖ్యమంత్రి గతంలో చెప్పారని... ఇప్పుడు మాత్రం ప్రజాతీర్పును గౌరవిస్తానని అంటున్నారని రాజగోపాల్ అన్నారు. ఇదెంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రక్షణలోనే సీమాంధ్ర ఉద్యోగుల సభ జరిగిందని ఆయన ఆరోపించారు.