: ఏడోస్థానానికి పడిపోయిన పుజారా


టీమిండియాలో నమ్మదగ్గ బ్యాట్స్ మన్ గా అవతరించిన సౌరాష్ట్ర యువకెరటం చటేశ్వర్ పుజారా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఓ స్థానం పతనమై ఏడోస్థానంలో నిలిచాడు. ఐసీసీ నేడు తాజా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అయితే, టాప్-10 బ్యాట్స్ మెన్ జాబితాలో చోటు సంపాదించిన భారత క్రికెటర్ పుజారా ఒక్కడే. ఇక ఈ విభాగంలో సఫారీ స్టార్ హషీమ్ ఆమ్లా నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుండగా, విండీస్ వెటరన్ శివనారాయణ్ చందర్ పాల్, సఫారీ డైనమైట్ ఏబీ డివిల్లీర్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ ర్యాంకుల విషయానికొస్తే అశ్విన్ ఎనిమిదోస్థానంలో కొనసాగుతుండగా, ఓజా టాప్-10లో చోటు కోల్పోయాడు. ఆల్ రౌండర్ల జాబితాలో అశ్విన్ మూడోస్థానాన్ని నిలుపుకున్నాడు.

  • Loading...

More Telugu News