: ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర
భారీగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. అసోం రాష్ట్రంలోని జొరాట్ జిల్లా... వరదల తాకిడికి అతలాకుతలమయింది. అనేక ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. వరదల దెబ్బకు 45 గ్రామాల్లోని 25 వేల కుటుంబాలు ప్రమాదం అంచున నిలిచాయని చెప్పారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మపుత్రకు వరదలు రావడం ఇది మూడోసారి.