: నెల్లూరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమైక్య వేదిక ఏర్పాటు


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర ఐక్య వేదిక ఏర్పాటైంది. ఈ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి రోజుకో తరహాలో నిరసన ప్రదర్శనలు చేపడతామని ఆనం తెలిపారు. నెల్లూరు వీఆర్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున బంద్ పాటిస్తామని చెప్పారు. రిఫరెండం నిర్వహించిన తర్వాతే బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News