: తెలంగాణ తీర్మానాన్ని పాస్ కానివ్వం: శైలజానాథ్
ఢిల్లీలో ఏపీభవన్ ఎదుట విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు చేపట్టిన దీక్షకు రాష్ట్ర మంత్రి శైలజానాథ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర శ్మశానంలా మారుతుందని అన్నారు. తెలంగాణ తీర్మానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ కానివ్వబోమని చెప్పారు. అందుకే తాము రాజీనామాలు చేయలేదని వివరించారు. కాగా, ఏపీఎన్జీవోలపై నిన్న రాత్రి జరిగిన దాడిని మంత్రి ఖండించారు.