: టీఆర్ఎస్ విద్యార్థినేతకు నిజాం కాలేజిలో ఏం పని?: లగడపాటి


హైదరాబాదులో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేత బాలరాజు యాదవ్ పై దాడి ఘటనపై ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందించారు. అతడికి నిజాం కాలేజిలో ఏం పనుందని ప్రశ్నించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీఎన్జీవో సభ శాంతి, సామరస్యపూర్వకంగా సాగిందన్నారు. సభను క్రమశిక్షణతో నిర్వహించారని కితాబిచ్చారు. సభలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రముఖుల చిత్రపటాలను పెట్టారని ప్రశంసించారు.

ప్రస్తుతం కొందరు నేతలు రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారని.. వారు క్షమించమని వేడుకుంటే ప్రజలు క్షమిస్తారని అన్నారు. ప్రజల ఆకాంక్షను చూసైనా పార్టీలు తమ అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభజన ప్రక్రియపై ఎలా ముందుకెళతారో షిండే ఇంతవరకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షిండే 'తెలంగాణ నోట్' ప్రకటన మరింత గందరగోళం సృష్టించిందన్నారు. విభజన ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తారో స్పష్టంగా చెప్పలేదన్నారు.

  • Loading...

More Telugu News