: రాష్ట్ర గవర్నర్ మార్పు?
ప్రస్తుతం నెలకొన్న ఆందోళనలు మరికొంత కాలం కొనసాగితే... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అవకాశాలను పరిశీలించాలని ఇప్పటికే కేంద్ర హోం శాఖను భారత ప్రభుత్వం ఆదేశించినట్టు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలతో... ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని... రాష్ట్రపతి పాలనే దీనికి సరైన పరిష్కారంగా కేంద్రం భావిస్తోందని సమాచారం.
ఈ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ ను కూడా మార్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన సమయంలో ఎదురయ్యే రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ప్రస్తుత గవర్నర్ ను మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్థానంలో కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ వస్తారని... నరసింహన్ ను మరో రాష్ట్రానికి బదిలీ చేసే అవకాశం వుందని సమాచారం. దీనికి ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది.