: తెలంగాణ ప్రజలవల్లే ఏపీఎన్జీవోల సభ సక్సెస్: మంత్రి గీతారెడ్డి
తెలంగాణ ప్రజలు సంయమనం పాటించడం వల్లే శనివారం హైదరాబాదులో ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం అయిందని మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. కరీంనగర్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ సభ సక్సెస్ కావడంతో మరో సభ పెట్టేందుకే ఏపీఎన్జీవోలు ఉత్సాహపడడం సరికాదని అన్నారు. మిలియన్ మార్చ్ నిర్వహించాల్సిన అవసరంలేదన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన ఉపసంహరించుకోకుంటే లక్షలాది మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సభా వేదికపై నుంచి ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి సభ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పై దాడి ఘటన దురదృష్టకరమని గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. నిజాం కళాశాల హాస్టల్లోకి వెళ్ళి మరీ పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి చేయడం బాధ కలిగించిందన్నారు.