: అనవసర దిగుమతులకు కళ్లెం: చిదంబరం


తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ముఖ్యంగా అనవసర దిగుమతులను కట్టడి చేయనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అనవసర ఖర్చులను కూడా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. దీని వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని... ఈ మొత్తాన్ని ఇతర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టే అవకాశం కూడా ఉంటుందని అన్నారు.

రూపాయి పతనానికి అమెరికా ఫెడ్ రిజర్వ్ కారణమని ఆయన ఆరోపించారు. ఉద్దీపనలను ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా ప్రకటించిన వెంటనే... ఒక్కసారిగా రూపాయి పతనం కావడం ప్రారంభమయిందని అన్నారు. దీనికితోడు పన్నులు, ద్రవ్యోల్బణం కూడా రూపాయి పతనానికి కారణమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు తీసుకురావడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నారు.

  • Loading...

More Telugu News