: రేపట్నించి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
ప్రఖ్యాతిగాంచిన కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి. కోరిన కోరికలు తీర్చే గణపతిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.