: తెలంగాణ గడ్డపై మిలియన్ మార్చ్ ఆలోచన విరమించుకోవాలి : ఈటెల


తెలంగాణ గడ్డపై మిలియన్ మార్చ్ ఆలోచనను విరమించుకోవాలని ఈటెల సూచించారు. ఈ ఆలోచన చేస్తే మద్రాస్ వలే గెట్ లాస్ట్ అనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీఎన్జీవోలు నగరంలోని శాంతియుత వాతావరణాన్ని కల్మషం చేశారని అన్నారు. సీమాంధ్రుల కోట్ల రూపాయలతో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తానని తెలిపారు.

తెలంగాణ గడ్డ మీద జై తెలంగాణ నినాదాలు చేసే స్వేచ్ఛ కూడా మాకు లేదా? అని ఈటెల ప్రశ్నించారు. జై తెలంగాణ అన్న వారిని కొట్టారని తెలిపారు. నిన్న జరిగిన సభ వెనుక సీఎం కిరణ్ హస్తం ఉందని దీంతో రుజువైందని అన్నారు. సీమాంధ్రలో ఉద్యమాల వల్ల ఆర్టీసీ నష్టపోలేదని... కేశినేని, దివాకర్ ట్రావెల్స్ వల్లే నష్టపోయిందని తెలిపారు.

  • Loading...

More Telugu News