: సెంచరీ చేజార్చుకున్న ఉన్ముక్త్ చాంద్


టీమిండియాలో చోటు కోసం ముందు వరుసలో నిలిచిన ఢిల్లీ యువకిశోరం, భారత్-ఎ కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ (94) విశాఖ వన్డేలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక్కడి వీడీసీఏ-ఏసీఏ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో చాంద్ తొలి వికెట్ కు ఊతప్ప (90 బ్యాటింగ్) తో కలిసి 178 పరుగులు జోడించిన అనంతరం కివీస్ బౌలర్ డెవ్ సిచ్ బంతికి వెనుదిరిగాడు. కాగా, ఈ మ్యాచ్ లో తొలుత న్యూజిలాండ్-ఎ 257 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ కుర్రాళ్ళు 31 ఓవర్లలో 195 పరుగులు చేశారు. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 63 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లున్నాయి.

  • Loading...

More Telugu News