: లక్షా 30 వేల ఎకరాల భూ పంపిణీ చేస్తాం: రఘువీరా
రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు సద్దుమణిగాక.. లక్షా 30 వేల ఎకరాల భూ పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాదులోని భూ పరిపాలన కమిషనర్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. జాతీయ భూ సంస్కరణల ముసాయిదాపై సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని... అందరి అభిప్రాయాలను త్వరలోనే కేంద్రానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని భూముల రికార్డులను సీడీలుగా రూపొందిస్తామని చెప్పారు.