: సచివాలయాన్ని శ్మశానవాటికగా మార్చిన కాంగ్రెస్: నారాయణ


కాంగ్రెస్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్మశానవాటికగా మార్చిందని ఆరోపించారు. ఏపీఎన్జీవోల సభ ప్రశాంతంగా ముగియడం శుభ పరిణామమని అన్నారు. అయితే కొందరు నాయకులు మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయాన్ని తొందరగా తేల్చకుండా... కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్రాంతాల ప్రజల మధ్య అగ్గి రాజేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై సీపీఐ నిర్ణయం ఎప్పుడూ ఒకేలా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News