: అసెంబ్లీ రద్దు చేస్తే బిల్లు ప్రసక్తేరాదు: టీజీ
రాష్ట్ర విభజన అంశంపై మంత్రి టీజీ వెంకటేశ్ తనదైనశైలిలో స్పందించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ బిల్లు వీగిపోయేలా చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈమేరకు రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. తమ రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని, తద్వారా అసెంబ్లీ రద్దయితే బిల్లు ప్రస్తావనే ఉండదని మంత్రి చెప్పుకొచ్చారు. అధిష్ఠానాన్ని ఒప్పించే సత్తా తమకుందని, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం మెండుగా ఉంటుందని, ఇతర పార్టీల్లో అది కనిపించదని టీజీ పేర్కొన్నారు.