: సంగీత టీచర్ శృంగార చేష్టలు


విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ మరో ఉపాధ్యాయుడు దొరికిపోయాడు. రాజస్థాన్ లోని జైపూర్ పట్టణంలో ఒక ప్రైవేటు స్కూల్ యాజమాన్యం సంగీత ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 25 ఏళ్ల సంగీత ఉపాధ్యాయుడు భవర్ లాల్ దమాని క్లాస్ సమయంలో ఆరో తరగతి విద్యార్థినుల శరీరంపై పలు చోట్ల చేతులు వేయడం, అదోరకంగా చూడడమే గాకుండా వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు భవర్ లాల్ దమానీని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

  • Loading...

More Telugu News