: నిరాహారదీక్షకు మంద కృష్ణ సిద్ధం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలంగాణ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 12 నుంచి 14 వరకు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఎల్బీ స్టేడియంలోగానీ, ఇందిరాపార్క్ వద్దగానీ దీక్ష చేపడతానని వెల్లడించారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణకు యూపీఏ భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈనెల 29న గుంటూరులో అంబేద్కర్ వాదుల మహాసభ నిర్వహిస్తామని తెలిపారు.