: మరోసారి వన్డేలు ఆడాలనుంది : యూనిస్ ఖాన్


జింబాబ్వేతో టెస్టులో డబుల్ సెంచరీ చేసి మాంచి ఊపు మీదున్న పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ (200 నాటౌట్).. వన్డేల్లో మరోసారి ఆడాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. తానింత వరకు లిమిటెడ్ ఓవర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించలేదని... కాబట్టి సెలెక్టర్లు తనను మరోసారి వన్డే జట్టుకు ఎంపిక చేయాలని కోరాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన దక్షిణాఫ్రికా టూర్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న యూనిస్ జింజాబ్వే టూర్ కి సెలెక్ట్ అవడమే కాకుండా... డబుల్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. కాగా, జింబాబ్వేతో తొలి టెస్టులో పాక్ 221 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో, రెండు టెస్టుల సిరీస్ లో పాక్ 1-0తో ముందంజ వేసింది. రెండో టెస్టు ఈనెల 10 నుంచి హరారేలో జరగనుంది.

  • Loading...

More Telugu News